చిరు మౌనం వెనుక అగ్నిపర్వతం..

Posted [relativedate]

the tragical suspence behind chirangeevi silence
మెగా స్టార్ చిరంజీవి…దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగులో నెంబర్ వన్ హీరో.ఈ ప్రస్థానంలో ఆయనకి ఎవరి నుంచి అయినా గట్టి పోటీ వచ్చిన సందర్భాలు ఉన్నాయేమో గానీ ఆయన్ని దాటిపోయిన సందర్భాలు లేవు.రాజకీయ రంగప్రవేశం తర్వాత మాత్రం వరస వైఫల్యాలు పలకరించాయి.పాలిటిక్స్ లో అయన మెగా స్టార్ కాలేకపోయారు.ఓ స్టార్ గా మిగిలారు.ఆ పరిస్థితిని జీర్ణం చేసుకుని కాంగ్రెస్ లో చేరినా ఆశించిన ఫలితాల్లేవు.తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి కూటమికి ప్రచార కర్తగా మారి పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ జగన్ వైపు ఆశగా చూస్తున్న కాంగ్రెస్ దాదాపు చిరుని పట్టించుకోవడం మానేసింది.అయన టీడీపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నా ముందు సి.రామచంద్రయ్య,తాజాగా రఘువీరా రెడ్డి అలాంటిదేమీ లేదని చెప్పారు గానీ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అయన ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నాలే జరగలేదు.డిగ్గీ రాజా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ వచ్చి వెళ్ళాడు తప్ప చిరుని నిలబెట్టుకునేందుకు చొరవ చూపకపోగా పవన్, జగన్ ఇద్దరికీ వలేసేలా మాట్లాడి వెళ్ళాడు.ఈ పరిణామాలు సున్నిత మనస్కుడైన చిరుని ఇబ్బంది పెట్టాయి. అందుకే తన రాజకీయ ప్రస్థానం గురించి ఎన్ని పుకార్లు షికార్లు చేస్తున్నా అయన గొంతు విప్పలేదు.గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నా మౌనంగా వున్నారు.

అయితే మెగా మౌనం నిస్సహాయత లోంచి వచ్చింది కాదు.ఈసారి రాజకీయ వ్యూహం విఫలం కాకూడదని అయన అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తున్నారు.టీడీపీ లో చేరినా,చేరకపోయినా ఓ నిర్దిష్ట ప్రణాళికతో రాజకీయంగా అడుగులు వేయాలన్న తపనతో ఇన్నాల్టి పొలిటికల్ కెరీర్ ని సమీక్షించుకుంటున్నారు.ఆత్మశోధన పూర్తి అయ్యాక తీసుకునే నిర్ణయానికి కట్టుబడి అలుపెరగని పోరాటానికి చిరు సిద్ధమవుతున్నారు.అందుకే లోన అగ్నిపర్వతాలు పేలుతున్నా చిరు మౌనం గా వున్నారు.