మాజీ ప్రధాని మన్మోహన్ మనసులో మాటట

Posted November 20, 2016 (3 weeks ago)

 

manmohan singh

మిత భాషి సహజంగా ఎవరి వద్దా పెద్దగా మాట్లాడని మాజీ ప్రధాని మన్మోహన్‌.. తన చిరకాల మిత్రులు కలిసినప్పుడు మాత్రం మనసులోని మాటలను బయటపెడుతూ ఉంటారని అంటుంటారు ఆయన సన్నిహితులు . మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలు శనివారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో జరిగాయి. సోనియాగాంధీ, మన్మోహన్‌లతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ సీనియర్‌ నేతలు, పార్లమెంటు సభ్యులు, మాజీ ఎంపీలు అందరు వచ్చారు .‘విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఎలా ఉంది?…వ్యవస్థ గాడిలో పడిందా? ఆర్థిక రంగం పట్టాలెక్కిందా..? అయినా మీకేం ప్రాబ్లమ్‌ లేదులే.. చంద్రబాబు ఉన్నారుగా..! కష్టపడి ఏదో విధంగా అభివృద్ధి చేస్తారులే’ అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు.ఏపీ అభివృద్ధిపై మాజీ ప్రధాని ఆరా తీశారు. విభజన జరిగాక ఎలా ముందుకెళ్తోందని అడిగారు. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ర్టాలు తప్పకుండా పురోగమిస్తాయనడంలో సందేహం లేదని చెప్పినట్లు ఓ ఎంపీ తో అన్నారట …

.

 

NO COMMENTS

LEAVE A REPLY