ఈ జీవితం అమ్మనాన్నలకే..!

 Posted [relativedate]

There Is No Marriage In My Life Says Sai Pallaviమలయాళ ప్రేమంతో మలార్ గా అక్కడి ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ఆ క్రేజ్ తో సౌత్ భాషలన్నిటిలో ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల డైరక్షన్లో ఫిదా మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ తెలుగులో మెగా హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వడం గొప్పగా ఫీల్ అవుతుంది. తన సహజ నటనతో అటు ఓ పక్క తమిళ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్న ఈ అమ్మడు కోలీవుడ్ ఆఫర్లను రిజక్ట్ చేస్తుంది అన్న వార్తలు వచ్చాయి.

తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ భామ తనకు ఏ ఒక్క కోలీవుడ్ ఆఫర్ రాలేదని.. అలాంటప్పుడు తాను ఎలా వాటిని కాదంటాను అన్నది. ఇక పెళ్లిపై తన నిర్ణయాన్ని మాత్రం గట్టిగానే చెప్పింది ఈ చిన్నది. తన జీవితం అమ్మనాన్నలకే అంకితమని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి సేవలు చేస్తా అంటుంది సాయి పల్లవి. మరి అమ్మనాన్నల మీద సాయి పల్లవికి ఉన్న ప్రేమ అందరిని వారెవా అనేలా చేస్తుంది. మరి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండటం కష్టమే.. అమ్మడు చెప్పిన మాట మీద నిలబడుతుందో లేదో చూడాలి.