భర్త ఇలా ఉంటే… భార్యకు సంతోషం

Posted December 7, 2016

tips of wife and husband living life***మగవాడిలో తండ్రి, భర్త ఈ రెండు ధోరణులూ ఉన్నప్పుడు సహచరికి ఓ వరం.ఈ గుణాలు పుష్కలంగాఉన్న భర్త దొరికితే వారి దాంపత్య జీవితం పదికాలాలు సంతోషంతో వుంటుందట .

**అమ్మాయిల మనస్తత్వం గురించి అనేకమంది వర్ణించి చెప్పారు, అయితే మగవాళ్ల మనస్తత్వాల గురించి తెలుసుకునే అవకాశాలు మాత్రం అమ్మాయిలకు తక్కువనే చెప్పాలి.

** ఓ మగవాడిలో స్నేహితుడు కనిపిస్తాడు, భర్త కనపడతాడు, తండ్రి కనపడతాడు

***. ప్రతి మగువ తనకు కాబోయే భర్త రూపవంతుడూ, గుణవంతుడూ కావాలని కోరుకుంటుంది

** మహిళలు ఎక్కువగా వారి స్వభావంకన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని మానసిక తత్వవేత్తలు చెప్తున్నారు.

**మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడు  

**చాలామంది మగవారు దృఢంగా, గంభీరంగా ఉంటే తమ భావోద్రేకాల్ని అంత సులువుగా వ్యక్తం చేయరు.అయితే తమ భావోద్రేకాల గురించి అస్సలు చెప్పరు. మరికొందరేమో అన్ని విషయాల్లో ఓపెనగా ఉంటారు.

** నేటితరం అమ్మాయిలు తాము మెచ్చేమగవాడు సకల విషయాలను చివరకి పాత రిలేషనషి్‌పలు ఏమైనా ఉన్నా సరే, వాటి గురించి కూడా చెప్పాలని కోరుకుంటారు.ఇలా ఉండడంవల్ల తమ మధ్య విశ్వసనీయత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. ఫలితంగా వారిబంధం మరింత దృఢంగా మారుతుందన్న ఉద్దేశం.

*** పక్కన లేకున్నాసరే ప్రతివిషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పే హజ్బెండ్‌ ఉంటే మీరు లక్కీనే.

**ఈ కాలం మగువలు చాలామంది స్వతంత్ర ధోరణిలో ఉన్నాసరే కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా భర్త అండగా ఉండాలని కోరుకుంటారు .దీనివల్ల జీవితం సజావుగా ఉంటుందని వారి నమ్మకం.

**ఇబ్బందికర పరిస్థితుల్లో ఆదరించి పరిష్కారంచూపే దిశగా గైడ్‌చేసి ఒత్తిడిని తగ్గిస్తాడు. ఉద్యోగం నుంచి రాత్రిళ్ళు ఇంటికి చేరినా సరే తనకోసం చూడకుండా ఆహారం సిద్ధం చేసే వ్యక్తినీ, ఆర్థిక అంశాల్లో సమతుల్యం పాటించగలమన్న భరోసా ఇచ్చే వ్యక్తినీ కోరుకుంటున్నారు.

** తన కుటుంబానికి, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలు వినడంలో నిరాసక్తత చూపిస్తే అలాంటి వ్యక్తిని వదులుకోవడానికి సైతం సిద్ధంగా ఉంటున్నారట.

**బాంధవ్యం కలకాలం నిలిచి ఉండాలంటే ఇద్దరూ ఒకరినొకరు ప్రభావితం చేసుకోగలగాలి. నిరంతరం కేరింగ్‌ చూపుతూ బాధ్యతలు పంచుకోవడానికి, మీరు చేసుకునే అబ్బాయి సదా సన్నద్ధంగా ఉండే వ్యక్తి అయితే అదృష్టవంతుడే.

** ఆ చేతిని విడవనేకూడదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహాయపడుతూ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో తోడుగా నిలిచే వ్యక్తి దొరికితే పూర్తి అనుకూలత కలిగిన భర్తగా అతన్ని చెప్పవచ్చు. అలా ప్రభావితంగా ఉండే అబ్బాయి కోసం అమ్మాయిలు ఎప్పుడూ ఆలోచిస్తూ వుంటారు

***దాంపత్య జీవనంలో చిన్న చిన్న తగాదాలు, గొడవలు ఎప్పటికప్పుడు సమసిపోయే విధంగా ఉండాలి. అసలు వాగ్వాదాలు లేవు అని ఏ దంపతులైనా చెబితే అది నమ్మశక్యం కాని విషయమే.

***భర్తపాత్రని సక్రమంగా నిర్వర్తించగలిగే వ్యక్తి తప్పకుండా తండ్రి పాత్రని కూడా సక్రమంగా పోషించగలుగుతాడు. పిల్లలు పుట్టినతర్వాత తల్లిదండ్రులు ఎంత సంతోషంతో ఉంటారో వారు పెరుగుతున్నకొద్దీ ఆ సంతోషంతో పాటు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి

**కాబోయే భర్త పట్టువిడుపులుగల వ్యక్తిత్వం ఉన్నవాడైతే పిల్లల వ్యవహారాలను సమర్థవంతంగా స్వీకరించగలడు. అతనికి సహనం, ఓర్పు కీలకం. పిల్లలు చికాకు పెట్టినా సరే తిట్టకుండా, శాంతంగా, వారిని హ్యాండిల్‌ చేయగలుగుతుంటే అతని భార్య గొప్ప అదృష్టవంతురాలని చెప్పొచ్చు

***వృత్తి ఏదైనా సరే భర్త తన వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని సునాయాసంగా నిర్వర్తించగలుగుతున్నాడో లేదో చూడాలి. అతను కనుక అలా చేయగలిగితే కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలవాడని చెప్పవచ్చు

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY