మరింత పెరిగిన వివేక్ ఇమేజ్!!

 Posted April 1, 2017 (4 weeks ago)

trs party leader vivek win hyderabad cricket association president elections
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వివేక్ భారీ హిట్ కొట్టారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికై సత్తా చాటారు. ఈ గెలుపుతో కేసీఆర్ దగ్గర ఆయన మార్కులు మరింత పెరిగాయని ప్రచారం జరుగుతుంది.

నిజానికి H.C.A లో సత్తా చాటడం వివేక్ కంటే టీఆర్ఎస్ కు ఎంతో అవసరం. ఎందుకంటే టీఆర్ఎస్ కు రాజకీయాల్లో ఎదురు లేకపోయినప్పటికీ.. క్రికెట్ అనుబంధ సంఘాల్లో ఇంకా పాగా వేయలేకపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులు జరుగుతున్న సమయంలో H.C.A అధ్యక్షుడు తమ వ్యక్తి ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పట్నుంచో అనుకుంటున్నారట. అయితే క్రికెట్ సంఘం ఎన్నికలో హిట్ కొట్టే ఆ స్థాయి వ్యక్తులు టీఆర్ఎస్ లో లేరు. సరిగ్గా అదే సమయానికి వివేక్ టీఆర్ఎస్ లోకి వచ్చారు. H.C.A అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. అనుకున్నట్టే హిట్ కొట్టారు.

H.C.A అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ గెలవడంతో కేసీఆర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ఇప్పుడు కేసీఆర్ దృష్టిలో వివేక్ ఇమేజ్ మరింత పెరిగిందని చెబుతున్నారు. వివేక్ మంచి ఇంప్రెషన్ కొట్టేశారట. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ కు ఇక ప్రమోషన్ ఖాయమని కూడా ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వివేక్ కు పదవి ఇస్తే.. ఆ వర్గాన్ని ఆకట్టుకోవచ్చన్నది కేసీఆర్ ప్లాన్ అట. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే దిశగా మంతనాలు జరుగుతున్నాయని టాక్. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఖాళీలు లేకపోవడంతో… వివేక్ కొంత నిరుత్సాహంతో ఉన్నారట. అయితే ఎప్పుడు ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయినా.. ఛాన్స్ మాత్రం ఆయకేనన్న హామీ లభించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి వివేక్ ఆశ నెరవేరుతుందో? ఏదో?

Post Your Coment
Loading...