ట్రంప్ జీతం నెలకి 5 , 6 రూపాయలేనా?

Posted November 14, 2016 (4 weeks ago)

trump monthly salary
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న డోనాల్డ్ ట్రంప్ జీతమెంతొ తెలుసా? ఏడాదికి కేవలం 1 డాలర్ అంట.అంటే 60 నుంచి 70 రూపాయలలోపు..నెలకి ఐదారు రూపాయలు మాత్రమే. మరీ ఇంత తక్కువ జీతం ఎలా ఉంటుంది అన్న సందేహం వస్తోందా? నిజమే అసలు అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి 4 లక్షల డాలర్లు.అయితే ప్రచార సమయంలోనే అంత జీతం తీసుకోనని ప్రకటించిన ట్రంప్ ఎన్నికల్లో గెలిచాక మరోసారి ఆ అంశంపై వివరణ ఇచ్చారు.తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఏడాదికి కేవలం ఒక్క డాలర్ జీతమే తీసుకుంటానని చెప్పారు.ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మరికొన్ని చర్యలు కూడా ట్రంప్ ప్రకటించారు.భారీగా ఖర్చయ్యే విదేశీ పర్యటనలు ఎక్కువగా చేయబోనని అయన చెప్పారు.చాలా పనులు ఉన్నందున సెలవలు కూడా పెద్దగా పెట్టబోనని ట్రంప్ ప్రకటించారు.ప్రచార సమయంలో మాట్లాడినట్టే దేశంలో అక్రమంగా ఉంటున్న 30 లక్షల మంది విదేశీయుల్ని బయటికి పంపడమో ..లేక అదుపులోకి తీసుకొవడమో చేసి తీరతామని అయన స్పష్టం చేశారు. ఏ విధంగా చూసినా ప్రచార పర్వంలో సంచలనం రేపిన అంశాలపై ట్రంప్ పట్టు విడుపులు ప్రదర్శించే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY