మంచి మనస్సుతో ముందుకు వస్తే ఏంటి ఈ అవమానం?

Posted April 20, 2017 (1 week ago) at 17:14

TSCO said Samantha not appointed Handloom Brand Ambassador
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్‌ ఉన్నా కూడా చేనేత కార్మికులు నేచిన చీరలను కట్టుకోవడం కాని, కనీసం ఏ ఒక్కరు అయినా చేనేత గురించి మాట్లాడటం కాని జరగలేదు. కాని టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత చేనేతన్నల కష్టాలు చూడలేక, వారు తయారు చేస్తున్న వస్త్రాలకు తనవంతు సాయం అన్నట్లుగా పబ్లిసిటీ చేసేందుకు ముందుకు వచ్చింది. పబ్లిసిటీలో భాగంగా ఇప్పటికే పు సార్లు చేనేత కార్మికులు తయారు చేసిన చీరను కట్టుకోవడంతో పాటు, పలు కార్యక్రమాల్లో చేనేత గురించి చెప్పుకొచ్చింది.

ఇదంత కూడా సమంత మానవత దృక్పదంతో చేసింది. తెలంగాణ ప్రభుత్వం మరియు టెస్కో వారు సమంత సేవలను గురించి ఆమెను గౌరవించాల్సి ఉంది. కాని ఆమె చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కాదు అని, ఆమెను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించలేదు అంటూ తాజాగా టెస్కో అధికారులు చెప్పుకొచ్చారు. ఏదో ఆమెకు సరదా అయ్యి, టైం పాస్‌ కాక వచ్చి ప్రచారం చేసినట్లుగా టెస్కో వ్యవహరించడంతో అంతా షాక్‌ అయ్యారు. సమాచార హక్కు చట్టం కింద సమంత చేనేత వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించగా వారి నుండి ఇలాంటి సమాధానం వచ్చింది. టెస్కో ఇచ్చిన సమాధానంపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయ్యాడు. సమంత బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ మరోసారి టెస్కోతో ప్రకటన ఇప్పించాడు.

Post Your Coment
Loading...