తుమ్మల వర్సెస్ జగదీశ్ రెడ్డి!!

Posted February 7, 2017 (3 weeks ago)

tummala vs jagadeesh reddy
తెలంగాణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…మరో మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ ఇద్దరి రాజకీయంలో టీఆర్ఎస్ క్యాడర్ నలిగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డికి ఇద్దరిదీ ఒక జిల్లా కాదు. మరి ఇద్దరికీ ఎక్కడి చెడిందంటే… నల్లగొండ డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ విషయంలో ఇద్దరూ పట్టుదలతో ఉన్నారని టాక్. డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ అభ్యర్థిత్వం ఆశించే వ్యక్తి… తుమ్మలకు బాగా కావలసిన వాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వ్యక్తిపై జగదీశ్ రెడ్డికి మంచి అభిప్రాయం లేదట. ఆయన ఛైర్మన్ కాకుండా జగదీశ్ అడ్డం పడుతున్నారన్న వాదన ఉంది. తుమ్మల మాత్రం తనకు కావలసిన వ్యక్తి కోసం జోరుగా లాబీయింగ్ చేస్తున్నారట. అయితే జగదీశ్ వాదనలో ఎంతో కొంత బలం లేకపోలేదు. ఎందుకంటే ఇది తుమ్మల సొంత జిల్లా కాదు. ఆ ఇలాకా జగదీశ్ రెడ్డి పరిధిలోకి వస్తుంది.

తుమ్మల, జగదీశ్ రెడ్డి.. ఇద్దరూ సీఎం కేసీఆర్ కు సన్నిహితులే. అయితే తుమ్మలపై కేసీఆర్ కు కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకే పక్క జిల్లాలో తన ఆధిపత్యం కోసం తుమ్మల ప్రయత్నిస్తున్నా… కేసీఆర్ ఏమీ అనడం లేదట. అంతేకాదు ఈ విషయంలో జగదీశ్ పైనే కేసీఆర్ అక్షింతలు వేశారని టాక్.

టీఆర్ఎస్ లో తుమ్మల కంటే జగదీశ్ రెడ్డి బాగా సీనియర్. అయినా తుమ్మల నిన్నగాక మొన్న వచ్చి అదీ తన ఇలాకాలో తలదూర్చడం జగదీశ్ రెడ్డికి అస్సలు నచ్చడం లేదట. తనను కాదని ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా జగదీశ్ తట్టుకోలేకపోతున్నారట. అటు తుమ్మల మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని కానిస్తున్నారట. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY