నటుడు ప్రదీప్‌ ఆత్మహత్య

 Posted May 3, 2017 (4 weeks ago) at 15:46

tv actor pradeep self hanged
తెలుగు బుల్లితెర నటుడు ప్రదీప్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితమే సీరియల్‌ నటి పావని రెడ్డిని పెళ్లి చేసుకున్న ప్రదీప్‌ నేటి ఉదయం 4గంటలకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రదీప్‌ ఆత్మహత్య తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ‘సప్తమాత్రిక’ సీరియల్‌లో నటించిన ప్రదీప్‌ కుటుంబం కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ప్రదీప్‌ ఆత్మహత్యకు అసలైన కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. పోలీసులు ప్రస్తుతం ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.

హైద్రాబాద్‌లోని పుప్పాలగూడ అలకాపురి కానీలో గ్రీన్‌ హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ప్రదీప్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన ప్రదీప్‌కు, కుటుంబ సభ్యులకు విభేదాలు వచ్చాయట. అంతేకాకుండా భవిష్యత్‌ మీద ఎన్నో అంచనాలను పెట్టుకున్న ప్రదీప్‌కు సరిజ్ైున అవకాశాలు లేని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ మొదలెట్టారు.

Post Your Coment
Loading...