TV 9 లో చెప్పేదొకటి ..రవిప్రకాష్ చేసేదొకటా?

Posted January 26, 2017

tv9 ravi prakash Worshiped god with his family
జ్యోతిష్యం మూఢనమ్మకం…రంగురాళ్ళని నమ్మడం మూఢ విశ్వాసం …ఆ అర్థమైందా ? మీరు అనుకుంటున్నదే ..ఇలాంటి విషయాలు చెప్పే TV 9 గురించి తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.న్యూస్ చానెల్స్ విభాగంలో ఒక్క తెలుగులోనే కాదు యావత్ భారతావనిలో తనదైన ముద్ర వేసింది.కేవలం వార్తలు ఇవ్వడమే కాకుండా సెన్సేషన్ చేయడంలో టీవీ 9 ముందుంటుంది.సామాజిక పరిణామాలపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టేలా చెప్తుంది. ఫ్యాక్షనిస్టులు గురించి కలం పోరాటం చేసినా …కట్నం తీసుకున్న వాడు అడ్డగాడిదని చెప్పినా ఆ ఛానల్ కి మాత్రమే చెల్లింది.జర్నలిజం లో నేడు కనిపిస్తున్న దూకుడుకి పుట్టినిల్లు టీవీ 9 అని తెలుగు ప్రజానీకానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..ఇక జర్నలిజం గురించి అవగాహన ఉన్నోళ్లకి టీవీ 9 కి ఆ దూకుడు మంత్రం నేర్పింది రవి ప్రకాష్ అని వేరే చెప్పక్కర్లేదు.

వామపక్ష భావజాల ప్రభావం నుంచి వచ్చిన రవిప్రకాష్ జాతకాలు,రంగురాళ్ళకి వ్యతిరేకంగా ఎంత పోరాటం చేస్తున్నారో అందరికీ తెలుసు ..అయితే ఆయన కూడా వాటిని నమ్మి పరిహారపు పూజలు చేయించుకుంటున్నారని ఎవరైనా చెపితే నమ్మగలమా? కానీ సోషల్ మీడియా లో ఇందుకు సంబంధించిన ఫోటో,వీడియో ఒకటి విస్తృతంగా ప్రచారంలో వున్నాయి.ఓ హోమం వద్ద అయన పూజలు చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.అయితే అది ఏ సందర్భంలో ఎక్కడ చేశారన్న వివరాలు లేవు.అయితే రవిప్రకాష్ ని ఆ రూపంలో చూసిన వారు …దాన్ని నమ్మిన వారు మాత్రం టీవీ 9 చెప్పేది ఒకటి..రవిప్రకాష్ చేసేది మరొకటా అని ముక్కున వేలేసుకుంటున్నారు.అయితే ఆ దృశ్యాలు నిజమైనవా..కావా అనేది పూర్తి వివరాలు తెలిసేదాకా చెప్పలేం.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY