ట్విట్టర్ లో అదనం గా మరో రెండు ఫీచర్ ల జోడింపు ..

0
17

Posted November 30, 2016 (2 weeks ago)

Image result for twitter

ట్విట్టర్‌ మొబైల్‌ యాప్‌లో ‘రిప్లై కౌంటర్‌’, ‘కన్వర్సేషనల్‌ ర్యాంకింగ్‌’ అనే ఫీచర్‌లను తీసుకొచ్చిన‌ట్లు ట్విట్టర్ వెల్లడించింది ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ ముందుకు వ‌స్తూ ఆకట్టుకుంటున్న సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్ తాజాగా ఈ రెండు కొత్త ఫీచర్‌ల ను ఆవిష్క రించింది. ఈ ఫీచ‌ర్ల ద్వారా ట్విట్ట‌ర్‌ మొబైల్‌ యాప్‌లో మీ ప్రముఖ సంభాషణలను కనుగొన‌వ‌చ్చు

ఈ ఫీచ‌ర్ల ను జోడించడం వల్ల ట్వి్టర్‌లో యూజర్లు పొందిన రిప్లైలను ఇక‌పై క్రొనోలాజికల్‌ ఆర్డర్‌లో కాకుండా వేరేలా కనిపిస్తాయి . ట్విట్ట‌ర్‌లోని ఇతర ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్లు ఇంత‌కు ముందు లాగే ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ తాజా ఫీచర్‌ల‌తో యూజ‌ర్‌కి ముఖ్య‌మైన సంభాషణలు పై వరుసలో క‌నిపిస్తాయి. ట్విట్ట‌ర్ ఖాతా క‌లిగిన వ్య‌క్తి చేసిన ట్వీట్‌కు ఎంతమంది యూజర్లు నేరుగా రిప్లై ఇచ్చారనే విషయం కూడా ఇక పై స్పష్టంగా అర్ధం అవుతుంది .

NO COMMENTS

LEAVE A REPLY