డబ్బునోళ్ళకి అపరిచితుల కాల్స్ …

Posted [relativedate]

unknown calls for the low salary people
డబ్బు లేనోళ్లకే కాదు …డబ్బునోళ్ళకి కూడా ఎన్ని కష్టాలుంటాయో ఒక్క రోజులో రుచి చూపించారు ప్రధాని మోడీ.అయన నిర్ణయం తో గందరగోళంలో పడ్డ తెలుగు కోటీశ్వరులకు మరో సమస్య వచ్చిపడింది.ఈ ఉదయం నుంచి వ్యాపార వేత్తలు,రాజకీయనాయకులకు గుర్తు తెలియని నంబర్స్ నుంచి ఫోన్ లు వస్తున్నాయి.ముంబై నుంచి మాట్లాడుతున్నామంటూ చెప్పి మీ దగ్గరున్న పెద్దనోట్లు ఇస్తే …కాస్త కమిషన్ తీసుకుని మిగతాది డాలర్స్,బంగారం రూపంలో తిరిగి చెల్లిస్తామని ప్రపోజల్ పెడుతున్నారు.ఆ మాట వినగానే ఎన్ని సందేహాలు…ముక్కుమొహం తెలియని వాళ్ళని నమ్మడమెలాగా? ఒకవేళ ఐటీ శాఖ వాళ్లే ఫోన్ చేస్తున్నారేమో? ఈ సందేహాలన్నీ ఒకవైపు మదిని తొలుస్తుంటే నిజంగా 500, 1000 నోట్లు తిరిగి డాలర్స్,బంగారం రూపంలో ఇంటికి నడిచి వస్తాయేమోనన్న ఆశ మరోవైపు.ఏమబ్బా ఈ డబ్బునోళ్ల కష్టాలు…అంత ఈజీ కాదని ఇప్పటికైనా ఒప్పుకుంటారా?