ఎన్టీఆర్ కి ఆ మార్కెట్ తెచ్చిపెట్టిన వక్కంతం ..

Posted January 18, 2017

vakkantam increased ntr craze
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత సినిమాల రీమేక్ మీద బాలీవుడ్ కన్ను పడింది.ఇందుకు కారణం ఎవరో కాదు ఎన్టీఆర్ తో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొద్దిలో కోల్పోయిన రైటర్ వక్కంతం వంశీ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అశోక్,ఊసరవెల్లి,టెంపర్ వంటి సినిమాలు వచ్చాయి.వాటిలో టెంపర్ హిట్ సినిమాగా నిలిచింది.దాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారు.సచిన్ జోషి నిర్మాతగా,రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు.ఇదే స్టోరీ ని అభిషేక్ బచ్చన్ హీరోగా చేద్దామని పూరి కూడా ప్రయత్నించారు. కానీ ఎన్టీఆర్ స్థాయిలో ఎమోషన్స్ పలికించడం నా వల్ల కాదని అభిషేక్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ఇప్పుడు అదే వక్కంతం కధ బాలీవుడ్ లోని పెద్ద దర్శకుల్లో ఒకరైన రోహిత్ శెట్టి చేతుల్లో పడింది.

ఈ రీమేక్ వార్తలతో బాలీవుడ్ ప్రముఖుల దృష్టి ఎన్టీఆర్ పాత సినిమాల మీద పడింది.హిట్,ప్లాప్ లతో సంబంధం లేకుండా అయన చేసిన సినిమాల్లో ఏవి రీమేక్ కి అనుకూలమో అని కొందరు దర్శక,నిర్మాతలు చూస్తున్నారు.ఆ లిస్ట్ లో ఊసరవెల్లి కి కూడా స్థానం ఉన్నట్టు తెలుస్తోంది.ఏదేమైనా ఎన్టీఆర్ పాత సినిమాల రీమేక్ కి డిమాండ్ వస్తే అయన నిర్మాతలకి అనుకోని అదృష్టం తలుపు తట్టినట్టే.ఇక ఎన్టీఆర్ సినిమాలకి కొత్తగా ఇంకో మార్కెట్ యాడ్ అయినట్టే.ఆ ఘనత రచయిత వక్కంతం వంశీ కి ఇవ్వడంలో తప్పు లేదు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY