జీవితం విలువ ఎంతంటే..?

 Posted October 18, 2016

value of life

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్నగదిలో  ఉపన్యాసం ఇస్తున్నాడు. తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు. సరే ఈ వెయ్యి రూపాయలని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ  వెయ్యి
రూపాయలని బాగా మడతలు పడేలా నలిపేసాడు. మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు. తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ వెయ్యి రూపాయలని కింద పడేసి తన కాళ్ళతో తోక్కేసాడు. అప్పుడు ఆ వెయ్యి రూపాయలు నోటు బాగా మడతలు పడి, మట్టి కొట్టుకుపోయింది.  మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు. అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు…

నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు. ఇప్పటి వరకు ఈ వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు. ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వెయ్యి రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి వెయ్యి రూపాయలు. అలాగే మన  జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది.. ఒకవేళ మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు..

జీవితం ప్రతి సారి మనకు ఒక క్రొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది… జారవిడచిన అవకాశాల కోసం చింతించక క్రొత్త ఆశలతో సరికొత్త ఊహలతో ముందడుగు వేయి…వేయిరూపాయి నోటు ఎంత చిరిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో.. మన విలువ కూడా ఎప్పటికీ తరగదు..

✳ “నువ్వు ఎప్పడు నీ విలువను పోగొట్టుకోలేవు”✳ “నువ్వు ఒక గొప్ప వ్యక్తివి” …✅ఈ విషయం ఎప్పటికి మరవొద్దు✅….

Post Your Coment
Loading...