వంగ‌వీటి ప్రివ్యూ…

 

Posted December 22, 2016

vangaveeti movie previewచిత్రం : వంగ‌వీటి

న‌టీన‌టులు  :  సందీప్ కుమార్ , వంశీనెక్కంటి, వంశీచాగంటి, కౌటిల్య ,నైనా గంగూలి.

సంగీతం   : ర‌విశంక‌ర్

ద‌ర్శ‌క‌త్వం :  రామ్ గోపాల్ వ‌ర్మ‌

నిర్మాత  :  దాస‌రి కిర‌ణ్ కుమార్

బ్యాన‌ర్ :  రామదూత క్రియేష‌న్స్

రిలీజ్ డేట్ :  డిసెంబ‌ర్ 23, 2016

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, క్రియేటివ్ జీనియ‌స్  రామ్ గోపాల్ వ‌ర్మ ఎన్ని  వివాదాల్లో త‌ల‌దూర్చినా, వివాస్పద వ్యాఖ్య‌ల‌తో ఎంద‌రి నోళ్ల‌ల్లో నానుతున్నా, ఎన్ని ప్లాప్స్ తీసినా ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న సినిమాల‌కి క్రేజ్ ఏర్ప‌డిపోతుండ‌డం క్వైట్ కామ‌న్. ముందునుంచి ఆయ‌న‌కు మాఫియా అన్నా ముఠా క‌క్ష‌ల నేప‌ధ్యం అన్నా  చాలా ఆస‌క్తి. ఎన్నో సినిమాల్లో త‌న ఆస‌క్తికి దృశ్యం రూపం ఇచ్చుకున్నాడు. కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తే మ‌రికొన్ని సినిమాలు ప్లాప్స్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు వ‌ర్మ మ‌రో సినిమాతో సంచ‌ల‌నాలకు తెరతీసాడు. సినిమా పేరు వంగ‌వీటి . బెజ‌వాడ బెబ్బులి గా పేరు పొందిన వంగ‌వీటి మోహ‌న రంగా హత్యోదంతాన్ని  వంగ‌వీటి సినిమాకి ఇతివృత్తంగా తీసుకున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ట్రైల‌ర్స్  తో రిలీజ్ కు ముందే సంచ‌నాలు సృష్టించాడు. త‌న ట్రేడ్ మార్కుల షాట్స్ తో జ‌నంలో ఆస‌క్తిని క్రియేట్ చేసాడు. కాపు కాసే శ‌క్తి అనే ట్యాగ్ లైన్ తో ఇప్ప‌టికే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.  డిసెంబ‌ర్ 23న  థియేట‌ర్స్ లో కి వ‌స్తున్న వంగవీటి అంచ‌నాలు ఎలా ఉన్నాయి, ఆ సినిమాకి విజ‌యావ‌కాశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూద్దాం.

క‌థ‌, క‌థ‌నాలు :

విజయవాడ కాపు నేత వంగవీటి రంగా హత్యకు దారితీసిన పరిణామాలు… అంతకు ముందు… ఆ తరువాత జరిగిన పరిణామాలే ‘వంగవీటి’ సినిమా ఇతివృత్తం. అప్పటి రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా చెప్పుకునే విజయవాడ, వంగవీటి రంగా హత్యతో నెత్తుటి రాజకీయాలకు సాక్షిగా నిలిచింది. సామాజిక వర్గాలు కూడా ప్రధానాంశంగా మారడంతో రాజకీయ వర్గాల్లో కూడా ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. 1988, డిసెంబ‌ర్ 26న వంగ‌వీటి మోహ‌న‌రంగా ను హ‌త్య‌చేసారు. రంగా నిరాహారా దీక్ష చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న పై ప్ర‌త్య‌ర్ధులు బాంబుల‌తో దాడిచేసారు. హత్య జరిగిన కొద్ది నిమిషాల్లోనే విజ‌య‌వాడ అల్ల‌క‌ల్లోలం అయిపోయింది. అప్ప‌టి ప‌రిస్థితుల్ని వ‌ర్మ వంగ‌వీటి సినిమాలో త‌న‌దైన శైలిలో క‌ళ్ల‌కు క‌డుతున్నాడు. 

పాత్ర‌లు, పాత్ర‌ధారులు:

 వంగ‌వీటి మోహ‌న రంగా పాత్ర‌ను, వంగ‌వీటి రాధ పాత్ర‌ను  సందీప్ కుమార్ పోషిస్తుండ‌గా, చ‌ల‌సాని వెంక‌ట‌ర‌త్నం పాత్ర‌ను నెక్కంటి వంశీ , దేవినేని ముర‌ళి గా వంశీ చాగంటి, దేవినేని నెహ్రూ గా శ్రీతేజ‌, వంగ‌వీటి ర‌త్న‌కుమారి గా నైనా గంగూలి పోషిస్తున్నారు. 

అంచ‌నాలు , విజ‌యావ‌కాశాలు :

వంగ‌వీటి సినిమా మొద‌లెట్టిన నాటినుంచి వ‌ర్మ ఈ సినిమాను త‌న‌దైన శైలిలో ప్ర‌మోట్ చేస్తునే ఉన్నారు. అస‌లు ఈ సినిమా మొద‌లైన నాటినుంచి విజ‌య‌వాడ‌నుంచి వ‌ర్మ‌కు ఎన్నో బెదిరింపులు వ‌స్తునే ఉన్నాయి. కానీ వ‌ర్మ త‌న మానాన తాను ఈ సినిమాను చేసుకుంటూ పోయాడు. ఎలాంటి బెదిరింపుల‌కి, కోర్టు కేసుల‌కు భ‌య‌ప‌డ‌క  వంగ‌వీటి సినిమాలో తాను చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాన్ని సూటిగా చెప్పాడంటున్నారు.  ర‌క్త చ‌రిత్ర సినిమాలాగానే ఈ సినిమాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వ‌ర్మ త‌న టేకింగ్ తో క‌ట్టిప‌డేసాడ‌ని వార్త‌లొస్తున్నాయి. ఇక  వంగ‌వీటి సినిమా కి ఒక్క క‌ట్ కూడా ఇవ్వ‌కుండా క్లీన్ స‌ర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.  ఇక ఈ సినిమాకోసం వ‌ర్మ రెండు పాట‌ల్ని స్వ‌యంగా పాడాడు. వంగ‌వీటి వంగ‌వీటి , క‌మ్మ క‌మ్మ క‌మ్మ పాట‌ల్ని ట్రైల‌ర్స్ లోనే రివీల్ చేసి వ‌ర్మ ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించాడు. సో.. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి, విజ‌యావ‌కాశాలు కూడా మెండుగానే ఉన్నాయ‌ని రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. మ‌రి సినిమా జ‌నాన్ని థ్రిల్ చేస్తుందో , లేక నిరాశ‌ప‌రుస్తుందో చూడాలి.

 

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY