‘వెంకీ-రవితేజ మల్టీస్టారర్’ ఏమైందంటే.. ?

Posted October 7, 2016

  veeru potla said venkatesh raviteja multistarrer movie

వెంకీ-రవితేజ కలయికలో మల్టీస్టారర్ చిత్రానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి. దర్శకుడు వీరుపోట్ల ఈ మల్టీస్టారర్ కి ప్లాన్ చేశాడు. తీరా సెట్స్ పైకి వెళ్లే సమయంలో ఈ మల్టీస్టారర్ ఆగిపోయింది. అందుకు కారణాలేంటీ.. ? అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.

తాజాగా, వెంకీ-రవితేజ మల్టీస్టారర్ పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు వీరు పోట్ల. ఆయన దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా.. వీరూ మాట్లాడుతూ.. గతంలో వెంకీ-రవితేజ మల్టీస్టారర్ కి ప్రయత్నాలు జరిగిన మాటన నిజమే. కథ కూడా ఓకే అయ్యింది. 14రీల్స్ సంస్థ ఆ చిత్రాన్ని  నిర్మించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వివరించారు.

వీరు పోట్ల దర్శకత్వంలో సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’ దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. దీంతో.. లేటైన తన సినిమా ఫలితంపై సంతృప్తిగా ఉన్నాడు దర్శకుడు వీరుపోట్ల.

Post Your Coment
Loading...