వెలగపూడిలో ఉద్రిక్తత…

  velagapudi secretariat fightఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడులకు వినతి పత్రం ఇచ్చేందుకు యూనివర్సిటీల ప్రొఫెసర్లు సచివాలయం వచ్చారు. అయితే వినతిపత్రం తీసుకునేందుకు మంత్రులు గంటా, యనమల నిరాకరించారు.

దీంతో మంత్రులకు వ్యతిరేకంగా ప్రొపెసర్లు నినాదాలు చేస్తూ వెలగపూడి సచివాలయం వద్ద యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Post Your Coment
Loading...