బాబు ఆశలకు వెంకయ్య బ్రేకులు

 Posted May 1, 2017 (4 weeks ago) at 11:51

Venkaiah Naidu scoffs at rumours on mid-term polls chandrababu got shocked2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, వెంకయ్యల సాన్నిహిత్యమే టీడీపీ, బీజేపీ పొత్తు వికసించేలా చేసింది. అందుకే తెలంగాణలో కూడా అనూహ్య ఫలితాలు వచ్చాయి. అప్పట్నుంచి ఇద్దరూ పాలునీళ్లలా కలిసిపోయి.. అందరికీ కన్ను కట్టించారు. ఓ దశలో ప్రత్యర్థులు కూడా వీరిద్దరినే లక్ష్యంగా చేసుకున్నారంటే.. మైత్రీ బంధం ఎంత పటిష్ఠమైందో తెలుస్తోంది. కానీ అలాంటి నమ్మకమైన మిత్రుడు కూడా చంద్రబాబు ఆలోచనలకు బ్రేకేసే పని చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోవడం లేదని తేల్చిచెప్పేశారు.

ప్రధాని మోడీ ఏకంగా నీతి ఆయోగ్ సమావేశంలోనే ముందస్తు గురించి మాట్లాడితే.. వెంకయ్య అందుకు విరుద్ధంగా మాట్లాడటం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. మోడీ మనసెరిగి నడుచుకునే వెంకయ్య ఇలా ఎందుకు మాట్లాడారనేది కీలకంగా మారింది. ఏకకాలంలో కేంద్ర, రాష్ట్రాలకు ఎన్నికలు పెట్టే ఆలోచన మంచిదేనని, కానీ ముందస్తు ఎన్నికలు వస్తాయని మాత్రం తాను అనుకోవడం లేదన్నారు. అంటే వెంకయ్యకు కూడా తెలియకుండా మోడీ మంత్రాంగం చేస్తున్నారనుకోవాల్సి వస్తోంది.

ప్రధాని మోడీ చాలా భిన్నమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇంతవాడ్ని చేసిన గురువు అద్వానీకి విజయవంతంగా వెన్నుపోటు పొడిచిన మోడీ.. తర్వతా సీనియర్లందరికీ చెక్ పెడుతున్నారు. త్వరలో వెంకయ్యను కూడా ఉపరాష్ట్రపతిగా పంపిస్తారని, అందుకే ఆయనకు ఇంతకుముందు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోకం కోడై కూస్తోంది. ఈ ఊహాగానాలకు చెక్ పడాలంటే రాష్ట్రపతి ఎన్నికలు రావాల్సిందే. అప్పుడే వెంకయ్యకు మోడీ ప్రాధాన్యం ఇస్తుందీ.. లేనిదీ తేలిపోతుంది.

Post Your Coment
Loading...