వెంకటేష్ ఫిక్స్ చేశాడు..!

Posted November 22, 2016

venkatesh guru gets release dateబాబు బంగారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసిన వెంకటేష్ ప్రస్తుతం గురు సినిమా చేస్తున్నాడు. సాలా ఖదూస్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించబడుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలను పెంచేసింది. అసలైతే సంక్రాంతి బరిలో దించాలని చూసిన చిత్రయూనిట్ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. మాత్రుక డైరక్టర్ సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శిష్యురాలిగా రితికా సింగ్ నటిస్తుంది.

కొత్త సంవత్సరం ఇక సంక్రాంతి సినిమాల వేడి తగ్గాక తన సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు వెంకటేష్. సినిమా మీద యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నదట. కచ్చితంగా వెంకీ ఎకౌంట్ లో మరో హిట్ పడటం కన్ ఫాం అంటున్నారు. రీమేక్ సినిమా అయినా తెలుగులో వెంకటేష్ ఇమేజ్ కు తగ్గట్టు కాస్త కొత్తగా ట్రై చేశారట దర్శకురాలు సుధ కొంగర. ఆల్రెడీ హింది, తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో వెంకటేష్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Post Your Coment
Loading...