వెంకీ… క్రిష్ కాంబినేషన్ అటకెక్కినట్లేనా..?

 Posted February 16, 2017

venkatesh krish combination movie stoppedగౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా నిరూపించుకున్నాడు క్రిష్. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఇండస్ట్రీ దృష్టి క్రిష్ మీదకు మళ్లింది. ఈ దర్శకుడు నెక్ట్స్ ఏ హీరోతో చేయనున్నాడు, ఎలాంటి సినిమాను ఎంచుకోనున్నాడు…. వంటివి చర్చనీయాంశంగా మారాయి. రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా నటించనున్నాడన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెరకెక్కనుందని గుసగుసలు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకీ, క్రిష్ కాంబోలో మూవీ రావ‌డం లేద‌ని తెలుస్తోంది.

క్రిష్ సెలెక్ట్ చేసుకున్న  క‌థాంశానికి, కాపీ రైట్ స‌మ‌స్య ఉండడం వల్ల వెంకీ ఆ సినిమాని చేయకూడదని నిర్ణయించుకున్నాడట. అలాగే గతంలో తన అన్నయ్య కొడుకైన దగ్గుబాటి రానా.. క్రిష్ తో కృష్ణం వందే జగద్గురం సినిమా చేశాడని, అది యావరేజ్ కావడంతో వెంకీ.. క్రిష్ తో చేయడానికి టెక్షన్ పడుతున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే గౌతమీపుత్ర సినిమా విజయం సాధించింది కాబట్టి ఒకవేళ క్రిష్ కాపీరైట్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తే వెంకీ సినిమా చేయాడానికి ఒప్పుకుంటాడని చెప్పుకుంటున్నారు. ఏమైనా ప్రస్తుతానికైతే వెంకీ, క్రిష్ ల సినిమా అటకెక్కినట్లేనని అంటున్నారు.

Post Your Coment

NO COMMENTS

LEAVE A REPLY