మోదిని టార్గెట్ చేసిన హీరో

Posted [relativedate]

vijay comments About Banned Currencyనరేంద్ర మోది రద్దు చేసిన 500, 1000 నోట్ల గురించి సాధ్యమైనంత వరకు పాజిటివ్ గానే అందరు స్పందించారు. అయితే అక్కడక్కడ విమర్శలు వస్తున్నా సరే వాటిని ఎవరు పట్టించుకోలేదు. సాధారణ జనం ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన వచ్చినా నల్లధనం నిర్మూలనకై ఈ ఇబ్బందిని అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఇక ఈ క్రమంలో మోదిని మెచ్చుకున్న సెలబ్రిటీస్ ఎంతమందో లెక్కే లేదు.

కాని తమిళ స్టార్ హీరో విజయ్ మాత్రం మోది రద్దు చేసిన విధానాన్ని తప్పుపట్టాడు. నోట్ల రద్దు మంచి నిర్ణయమే అయినా దాన్ని అమలు చేయడంలో మాత్రం సరైన విధి విధానాలను అనుసరించలేదు. అమలు చేసిన విధానం మాత్రం అసలు బాలేదు అన్నాడు ఇళయదళపతి విజయ్. ఎక్కడ ఎదిరిస్తే తమ దగ్గర నల్ల ధనం ఎంత ఉందని టార్గెట్ చేస్తారని ప్రతి ఒక్క సెలబ్రిటీ మోదికి జయహో అన్నారు తప్ప మోదిని విమర్శించే ప్రయత్నం చేయలేదు.

ఈ క్రమంలో విజయ్ అన్న మాట సాధారణ ప్రేక్షకులు కూడా వత్తాసు పలుకుతున్నారు. కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ప్రజల బాధలను అర్ధం చేసుకున్న వాడే నిజమైన హీరో ఆ విషయంలో విజయ్ మొదిని విమర్శించి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు.