అది పూర్తి అవాస్తవం.. పవన్‌ నా వద్దకు రాలేదు

Posted May 18, 2017 (1 week ago) at 13:15

vijayendra prasad says i don't write movie story for pawan kalyan
‘బాహుబలి’తో పాటు పలు సూపర్‌ హిట్‌ చిత్రాలకు కథలను అందించి ప్రస్తుతం ఇండియాలోనే టాప్‌మోస్ట్‌ స్టోరీ రైటర్‌గా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్‌ ఒక కథను పవన్‌ కోసం ప్రత్యేకంగా రాసేందుకు సిద్దం అయ్యాడు అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. పవన్‌ కోసం విజయేంద్ర ప్రసాద్‌ కథ రాస్తే, దానిని రాజమౌళి డైరెక్ట్‌ చేస్తాడని, పవన్‌, రాజమౌళిల కాంబో సినిమా తెలుగు ప్రేక్షకులకు పండగ తీసుకు వస్తుందని అంతా ఆశించారు. అయితే ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ ఈ విషయమై మాట్లాడుతూ తాను పవన్‌ కళ్యాణ్‌ కోసం కథ రాస్తున్నట్లుగా వచ్చిన వార్తలు నిజం కాదు, పవన్‌ కోసం కథ రాయాల్సిందిగా నన్ను ఎవరు సంప్రదించలేదు, పవన్‌ కూడా నన్ను ఎప్పుడు తన కోసం కథ రాయాల్సిందిగా కోరలేదు. అసలు పవన్‌కు కథ ఆలోచనే తనకు ఇప్పటి వరకు రాలేదని చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ కథ ఇంటర్వెల్‌ సీన్స్‌ను పవన్‌ ఇమేజ్‌ ఆధారంగా చేసుకుని రాశాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. ఆ కారణంగా కొందరు నెటిజన్స్‌ ఇలాంటి పుకార్లను అల్లి ఉంటారు. విజయేంద్ర ప్రసాద్‌ ప్రకటనతో పవన్‌ ఫ్యాన్స్‌ ఆనందంపై నీళ్లు జల్లినట్లయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

Post Your Coment
Loading...