vikram told ntr inkokkadu movie postponedఎన్టీఆర్-కొరటాల మూవీ ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు .. మలయాళ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సమయంలోనే విక్రమ్ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముగన్’ .. తెలుగులో ‘ఇంకొక్కడు పేరుతో అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల సమస్య తలెత్తుతుందని దర్శక నిర్మాతలు భావించారట. అంతేకాదు వసూళ్లపై ప్రభావం వుండే అవకాశం ఉందని అనుకున్నారు.

దాంతో తమ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోవడమే మంచిదని విక్రమ్ అనుకున్నాడట. ఆయనే ఎన్టీఆర్ కి స్వయంగా ఫోన్ చేసి, తమ సినిమా విడుదల తేదీని మార్చుకుంటున్నట్టుగా వెల్లడించాడట. విక్రమ్‌ స్వయంగా ఫోన్ చేసి విషయం చెప్పడం మన ఎన్టీఆర్ కి ఆశ్చర్యాన్ని కలిగించిందట. ‘ఐ’ స్టార్ మాంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన ఇమేజ్‌కు తగ్గ హిట్‌తో పాటూ వసూళ్ల కోసమే ‘జనతా గ్యారేజ్’తో పెట్టుకోకూడదని.. ఎన్టీఆర్ సందడి సద్దుమణిగిన తర్వాత.. థియేటర్స్‌లోకి వద్దామని అనుకుంటున్నాడు.

Post Your Coment
Loading...