వంగవీటి రంగా విగ్రహం ఆవిష్కరణలో కమ్మ ఎమ్మెల్యే..

Posted May 19, 2017 (6 days ago) at 12:46

vinukonda mla gv anjaneyulu inaugurate vangaveeti ranga statue in mundlamuru bus stand
రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఊహించడం కష్టం. 2014 ఎన్నికల ముందు టీడీపీ కి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించినప్పుడు క్షేత్ర స్థాయిలో ఈ పొత్తు వర్కౌట్ అవుతుందా అని రాజకీయ ఉద్దండులు డౌట్ పడ్డారు.ఆ సందేహాలు తీరిపోయేలా ప్రజల తీర్పు వచ్చింది.ముఖ్యంగా కమ్మ,కాపు వర్గాలు రాజకీయ వైరానికి వేదికగా వుంటూ వస్తున్న దక్షిణ కోస్తాలో మారుతున్న పరిస్థితులకి 2014 ఎన్నికల ఫలితాలు ఓ మచ్చుతునక.అయితే ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకున్నాక పరిస్థితులు అంత సానుకూలంగా లేవని రాజకీయ మేధావులు చెప్పుకుంటున్న మాట.ఇందులో నిజానిజాలు తేలాలంటే,ప్రజాభిప్రాయం ఎలా వుందో తెలుసుకోవాలంటే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాలి.కానీ కమ్మ,కాపు లు ఎక్కువగా వుండే గుంటూరు జిల్లాలో పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.

వినుకొండ లో వంగవీటి రంగా విగ్రహ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ జరిపారు కాపు నేతలు. ముండ్లమూరు బస్సు స్టాండ్ దగ్గర జరిగిన ఈ ఆవిష్కరణ సభకి వినుకొండ ఎమ్మెల్యే,కమ్మ వర్గానికి చెందిన జీవీ ఆంజనేయులు హాజరు కావడమే కాదు ..కాపుల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్య్కర్మాలాల్ని వివరించారు.ఆయన మాట్లాడుతున్నంత సేపు కాపు యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన చూసి సభకు వచ్చిన మిగిలిన పార్టీల నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. సభ ముగిశాక ఓ పార్టీ నాయకుడు సరదాగా ఎమ్మెల్యే తో అదే విషయాన్ని ప్రస్తావించారట.వినుకొండతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గంలోను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కి స్థానిక కాపు నేతలు గట్టి మద్దతు ఇవ్వడం చూస్తుంటే కోస్తా రాజకీయాల్లో అనూహ్య మార్పు వస్తున్నట్టు అనిపిస్తోంది.ఈ మార్పు రాజకీయంగా ఎటు దారి తీస్తుందో చూడాలి.

Post Your Coment
Loading...