VIP ల పుష్కర స్నానాలు..

0
92

  vip pushkara snanam

కృష్ణా పుష్కర పుష్కర శోభ సంతరించుకుంది. విజయవాడలోని దుర్గాఘాట్ లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మొదటగా పుష్కరస్నానం చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. తర్వాత కృష్ణమ్మకు చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు దంపతులు. టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ, టీడీపీ నేత లోకేష్, ఉన్నతాధికారులు కూడా పుష్కర స్నానాల్లో పాల్గొన్నారు. విజయవాడతో పాటు అమరావతి, శ్రీశైలంలోని పుష్కర ఘాట్ల దగ్గర పుష్కరస్నానాల కోసం భక్తులు ఉదయాన్నే భారీ సంఖ్యలో చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 5.58 నిమిషాలకు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండలం గొందిమళ్లలో కృష్ణా పుష్కరాలను అధికారికంగా ప్రారంభించారు.. సీఎం దంపతులు ఇవాళ మూడు పుష్కర స్నానాలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవతామూర్తులతో మొదటి స్నానం, పీఠాధిపతులతో రెండో స్నానం, మంత్రులతో మూడో స్నానం చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నదీ హారతి తీసుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటారు. గొందిమళ్లలో పుష్కరాలను ప్రారంభించిన తర్వాత అలంపూర్ జోగుళాంబ దేవాలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు

ఇవాల్టి నుంచి వరుసగా 4 రోజులు సెలవులు కావడంతో పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముంది. దీంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు శ్రీశైలం, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కు వరద ఎక్కువగా ఉండటంతో నదిలోకి నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఘాట్ల దగ్గర భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 81 పుష్కర ఘాట్లున్నాయి. ఘాట్ల దగ్గర ఏర్పాటు చేసన కంచె దాటి భక్తులు ముందుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 655 ట్రిప్పుల ప్రత్యేక రైలు సర్వీసులు, ఆర్టీసీ 1,365 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది..
పుష్కర భక్తులకు తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఘాట్లయిన బీచ్ పల్లి, రంగాపూర్, సోమశిల, కృష్ణా, పసుపుల, అలంపూర్, వాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్ దగ్గర ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY