నీరు దివ్య ఔషధం…!!

  Posted March 22, 2017Water benefits to cure human health

■వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది. ఈ రెండు వాయు పదార్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం.నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది. అవి ఏమిటంటే..
■గొంతునొప్పి, టాన్సిల్స్‌ : నీరు వేడిచేయాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిట పట్టాలి. ఉపశమనం కలుగుతుంది.
■జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ : నీటిని మరి గించాలి. దానిలో కొద్దిగా పసుపు లేక యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండుచుక్కలు వేయాలి. ఆ నీటిఆవిరిపడితే మంచి రిలీఫ్‌.
■తలనొప్పి : ఐస్‌ ముక్కలు నుదుటిపై రుద్దాలి.
■జ్వరం :తడిగుడ్డతో/ మంచు ముక్కలతో శరీరం ముఖ్యంగా పాదాలు, ఆరిచేతులు తుడవాలి. దీనివల్ల 1-2 డిగ్రీల జ్వరం తగ్గుతుంది.
■ఎక్కిళ్ళు :గోరువెచ్చని గ్లాసుడు నీరు నెమ్మదిగా సిప్‌ చేస్తూ త్రాగాలి.
■కుక్క కరిస్తే :సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. గాయాన్ని కడగాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కల్గించే సూక్ష్మజీవులు, చొంగపోతాయి. తిరిగి సబ్బు నీటితో కడిగి కట్టుకట్టాలి.
■చర్మం కాలితే : వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశం తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింతగా చర్మం కాలి పోకుండా ఉంటుంది.
■దగ్గు :వేడినీరు త్రాగితే కఫం కరుగు తుంది. పసుపును మరిగే నీటిలో వేసి ఆవిరి పట్టాలి.
■చిన్న చిన్న గాయాలు :చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకట్టి రక్తం కారడం తగ్గుతుంది.
■నిద్రపట్టకపోతుంటే : చల్లటి/ గోరువెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. పాదాలు వేడినీటి తో తడుపుకోవడం మంచిది.
■ఒళ్ళు నొప్పులు :వేడినీటిలో ఉప్పువేసి కాపడం కాయాలి.
■మలబద్దకం :ఎక్కువగా నీరు త్రాగాలి. రాత్రి రాగి చెంబులో నీరుపోయాలి. అది పరగడుపున త్రాగాలి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగును.
■వాపులవల్ల కలిగే నొప్పి : ఐస్‌ ముక్కతో బాగా రుద్దాలి.
■ముక్కులోంచి రక్తం పడుతుంటే :చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వెయ్యాలి.
■దంతాల నొప్పి :గోరువెచ్చని నీటిలొ ఉప్పువేసి పుక్కిలించాలి. ■శరీరంలోనొప్పులు :వేడినీటి కాపడం, వేడినీటి ఆవిరి.
■రుమాటిజం :ఎక్కువనీరు త్రాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. యూరిన్‌ ద్వారా యూరిక్‌ ఆమ్లంబయటికిపోతుంది.
■మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ : ఎక్కువనీరు త్రాగితే ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సూక్ష్మజీవులు వేగంగా, మూత్రం ద్వారా ఎక్కువగా విసర్జింపబడి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.
■కంటిలో నలక పడితే : నలపకూడదు. గ్లాసు నిండా నీరు తీసుకోవాలి. దానిలో కన్ను ముంచి చికిలించాలి. కంటిలోని దుమ్ము, ధూళి, నలకలు వంటివి నీటిలోకి వచ్చి బయటికి పోతాయి.
■విరోచనాలు, వాంతులు : శరీరంలో నుండి ఎంతనీరు బయటికిపోతుందో అంతే పరిమాణంలో నీరు త్రాగితే నిర్జలీకరణం అరికట్టబడుతుంది.
■రసాయనాలు చర్మంపై పడితే : ఎక్కువసే పు, ఏకధారగా నీరుపోస్తూ కడగాలి. తీవ్రత తగ్గుతుంది.
■మూత్ర పిండాలలో రాళ్ళు : ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. మూత్రం పలచబడడం వల్ల యూరిన్‌ యాసిక్‌ రాళ్ళు ఏర్పడవు. మూత్రకేశ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది.
■ఎక్కువగా నడవడంవల్ల కలిగే కాళ్ళనొప్పులు : గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలపాలి. కొద్దిసేపు ఆ నీటిలో పాదాలు ఉంచాలి.
■కడుపునొప్పి :హాట్‌వాటర్‌ బేగ్‌ ఆ ప్రదేశంలో ఉంచాలి.
■జ్వరం : గంటకు కనీసం ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది. శరీరం నుండి బయటికిపోయే నీరు భర్తీ అవుతుంది. నీరు ఆవిరి అవడంవల్ల చర్మం చల్లబడు తుంది. మలినాలు ఎక్కువగా విసర్జింప బడతాయి. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గుతాయి.
■శరీరంలో ఏ అవయవమైనా వాపు, నొప్పి :ఐస్‌ముక్కలతో రాయాలి.
■ఒంటికి నీరు పడితే :పెరుగు ఎక్కువగా వాడాలి. ఇది కఫాన్ని కరిగిస్తుంది కూడా.
■ముక్కులో, గొంతులో శ్లేషం : దోసిట్లో నీరు పోసుకొని ముక్కుతో లోనికి లాగడం.

నీరు తక్కువగా తాగితే…

■డీహైడ్రేషన్‌ కలుగు తుంది ,మలబద్దకం ఏర్పడుతుంది ,తలనొప్పి , తలతిరగడం , అలసట , నిస్రాణం , అందోళనం కలిగే అవకాశముంది .మూత్రవిసర్జన తగ్గుతుంది , ఒక్కొసారి మూతవిసర్జన ఆగిపోవచ్చును. కండరాల నొప్పులు, బలహీనత , కాళ్ళు చేతులు చల్లబడడం జరుగవచ్చును.చర్మము పొడిబారుతుంది , కాంతివిహీనమవుతుంది . నోరు పొడిబారుతుంది . అజీర్ణము – అనేక జీర్ణసంబంధిత బాధలు కలుగుతాయి.మూత విసర్జన సమయము లో మంట , నొప్పి కలుగుతాయి. మూతవిసర్జన సక్రమముగా జరగకపోతే రక్తం మలినాలతో నిండిపోయి విషపదార్ధాలు శరీరములో పేరుకు పోతాయి . అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది.

■వయసు పెరిగినకొద్దీ దాహము తగ్గుతుంది . నీరు తాగాలని అనిపించకపోయినా తగినంత నీరు తాగాలి ,లేకపోతే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. రోజుకు వ్యక్తి బరువు కిలోగ్రాములు /30 తో భాగించగా వచ్చే సంఖ్య లీటర్లలలో తీసుకుని సుమారుగా అన్ని లీటర్ల నీరు త్రాగాలి .ఎక్కువ రక్తపోటు , ఆస్థమా , విపరీతమైన శారీరక నొప్పులు రావడానికి తక్కువ నీరు తాగడం ఒక కారణము .

నీరు తాగే సరియైన సమయాలు:

●ఒక గ్లాసు నీరు = సుమారుగా 200 మి.లీ.

●2 గ్లాసులు నీరు — నడక వ్యాయామం తర్వాత తీసుకుంటే శరీరములోని అవయవాలు ఉత్తేజితమగును.

●2 గ్లాసులు నీరు– 30 నిముషాలు భోజనము ముందుతీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగును

●2 గ్లాసులు నీరు– 60 నిముషాలు భోజనము తరువాత తాగితే జీర్ణసంభందిత రుగ్మతలు పోవును.

●2 గ్లాసులు నీరు–05 నిముషాలు స్నానము చేసే ముందు తాగితే రక్తపోటు (బి.పి) తగ్గును

●2 గ్లాసులు నీరు–05 నిముషాలు పడుకునే ముందు త్రాగితే గుండె పోటు వచ్చే అవకాశ ము చాలా శాతము తగ్గును

●2 గ్లాసులు నీరు– పరగడుపున త్రాగితే ఎసిడిటీ బాదలు లేకుండాపోవును .. మూత్రపిండాల వ్యాధులు దరిచేరవు

రోజుకు ఎంతనీరు త్రాగాలి:

▪మనిషికి రోజుకు 2.5 లీటర్ల నీరు అవసరం , ఆరోగ్యము. కొంత నీరు మనము తినే ఘన పదార్డ ఆహారము నుండి లభిస్తుంది … మిగతాది త్రాగవలసిందే.

MGL ఆంజనేయులు 

Post Your Coment
Loading...