మోడీ నెక్స్ట్ టార్గెట్ బినామీ లేనా ..?

Posted [relativedate]

 

Don't close Modi’s surgical strikes on black money

ప్రధాని మోడీ త్వరలో మరో సంచలనానికి తెర లేపనున్నారా ? రాత్రికి రాత్రే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు దేశవ్యాప్తంగా జరుగుతున్న బినామీ లావాదేవీలపై కొరడా ఝళిపించడానికి మోదీ పావులు కడుపుతున్నారా ? లెక్క తెలీకుండా పోతున్న డబ్బు మొత్తాన్ని టాక్స్ పరిధిలోకి తేవాలని చేస్తున్న విప్లవాత్మక చర్యలలో భాగంగా బినామీలపై కన్ను పెట్టబోతున్నారు. జనవరి నుంచి సర్జరీ బినామీ మొదలవుతుందని సమాచారం.

బినామీ విషయంలో ఒత్తిడికీ తలొగ్గే సమస్య లేదని, మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ముందుకే వెళ్లాలని మోడీ నిర్ణయించుకున్నారని సమాచారం . దీనివల్ల తాత్కాలికంగా రాజకీయ వ్యతిరేకత వచ్చినా, దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయన్నది సర్కారు భావన.. ఈ విషయం మీదే సోమవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కూడా విస్తృతంగా చర్చ జరిగిందంటున్నారు. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి జాతీయవ్యాప్తంగా మద్దతు కనిపిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సమావేశం తర్వాత తెలిపారు.