ఏ చట్టం చెప్పింది అనుమతి తీసుకోమని ..ముద్రగడ

0
25

Posted November 22, 2016 (2 weeks ago)

mudragada and letter

తనయాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టం లో ఉందొ చెప్పాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మ నాభం డీజీపీ కి లేఖ రాసారు .ఈ నెల 16 రావులపాలెం నుంచి సత్యాగ్రహ యాత్ర నిర్వహించేందుకు ముద్రగడ సన్నద్దమైన సంగతి తెలిసిందే. అయితే ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ద్వారా పోలీసులు పాద యాత్ర ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సత్యాగ్రహ పాదయాత్రకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అనుమతి లేదనే కారణంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ముద్రగడ పాదయాత్రకు బ్రేకులు వేశారు.

తాజా గా ముద్రగడ మంగళవారం డీజీపీ సాంబశివరావు కు లేఖ రాశారు. గతంలో చంద్రబాబు గానీ, పలువురి నేతలు గానీ.. యాత్రలకు అనుమతి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి లేని అనుమతి తమకు ఎందుకన్నారు. తుని ఘటనలో తనపై, తన జాతిపై వస్తన్న ఆరోపణలు రుజవైతే ఆస్తులు అమ్మి నష్టపరిహారం చెల్లిస్తానని ముద్రగడ పేర్కొన్నారు. సెక్షన్ 30 తన జీవితాంతం అమల్లో ఉంటుందా..అని లేఖలో ప్రశ్నించారు ..

NO COMMENTS

LEAVE A REPLY