శ్రీకృష్ణుడి అవతారంలో హృతిక్.. మహేష్..?

 Posted April 20, 2017 at 15:15who is play sri krishna role in mahabharata hrithik roshan or mahesh

మహా భారతం ఇది ఒక గొప్ప కావ్యం.. మహాభారతం తీయాలని చాలా మంది డైరెక్టర్లు కలలు కన్నారు,ఆ లిస్ట్ లో ది గ్రేట్ రాజమౌళి కూడా ఉన్నాడు.. అలాంటి మన మహా భారతాన్ని ఇప్పుడు మలయాళం డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ తీయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. 1000 కోట్లు భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారత దేశ అగ్ర నటులు మొత్తం ఈ చిత్రం లో నటించటానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇంతలా ఈ మూవీ పై అందరు ఆసక్తి చూపటానికి కారణం మహాభారతం లో ఉన్నన్ని గొప్ప ట్విస్ట్ లు పాత్రలు మరే కథ లో వెతికినా దొరకవు.

ఈ మహాభారతంలో ముఖ్య పాత్రధారి శ్రీకృష్ణుడు… ఈ కృష్ణుడి లీలలు మహాభారతంలో హైలైట్స్ గా ఉంటాయి.. అందుకే ఈ సినిమా లో కృష్ణుడి పాత్రకోసం అగ్ర నటులను వెతికే పనిలో పడ్డాడు శ్రీకుమార్ మీనన్. ఈ కృష్ణుడి పాత్రను ఎవరు ధరిస్తారు అనేది ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్నగా ఏర్పడింది . ఈ పాత్ర కోసం డైరెక్టర్ శ్రీకుమార్ మీనన్ హిందీ నటుడు హృతిక్ రోషన్, మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబులను అనుకుంటున్నారట. ఒకవేళ హృతిక్ రోషన్ కి డేట్స్ కుదరకపోతే మహేష్ చేత చేయించాలని డైరెక్టర్ ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నాడు..

ఈ చిత్రం ‘రండమూజ్హం’ అనే బుక్ ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు ఈ చిత్ర దర్శకుడు. ఈ కథ మొత్తం భీముడు కోణంలో చెప్పబడుతుంది. భీముడు పాత్రని మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ చేస్తాడట. ఈ సినిమా స్క్రీన్ ప్లే రైటర్ గా వాసుదేవన్ నాయర్ చేయడం జరుగుతుంది. రెండు భాగాలుగా తీయనున్న ఈ మహా కావ్యమునకు ప్రముఖ బిజినెస్ మాన్ ‘బి ర్ శెట్టి’ ఈ సినిమా నిర్మాత. మహేష్ తన ఫిల్మ్ కెరీర్ లో ఎక్కడ జానపద చిత్రాల ఛాయలు కూడా లేవు. మరీ మహేష్ శ్రీకృష్ణుడి పాత్రను చేస్తాడా? లేక హృతిక్ రోషన్ చేస్తాడా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోయిద్ది..

Post Your Coment
Loading...