నలుపు ..తెలుపు అవుతుందా ..?

Posted November 18, 2016 (3 weeks ago)

will black money converted to white money

రద్దయిన తరవాత బ్యాంకుల్లో జామున డబ్బు సుమారు నాలుగు లక్షల కోట్లు! బ్యాంకుల ద్వారా ప్రజలకు చేరిన సొమ్ము మొత్తం రూ.75 వేల కోట్లు సుమారు ఫలితం జనం సొమ్ము బ్యాంకుల పాలు. ఇబ్బందులు కొన్నాళ్లే’ అని ప్రధాని మోదీ అంటున్న జనం మాత్రం ఇంకెన్నాళ్లు అని ఎదురు చూస్తున్నారు ‘కరెన్సీ కటకట’ ఇప్పట్లో తీరేది కాదని, ఆరు నెలలకుపైగానే పడుతుందని విశ్లేషకుల వాయిస్ .

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ‘నోటు’కు తాళం వేసేదిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే… రద్దయిన నోట్లకు సమానంగా కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశమే కేంద్రానికి లేదట . నగదు లావాదేవీలపై పూర్తిస్థాయిలో పట్టు బిగించడం, తద్వారా నల్ల ధనాన్ని నియంత్రించడం ఇందులో అత్యంత కీలకం అదే సమయంలో… సామాన్య జనం కరెన్సీ కోసం ఇక్కట్లు పడక తప్పదు. పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం వేస్తున్న ఒక్కో అడుగును నిపుణులు విశ్లేషించి చెబుతున్నారు .

దేశవ్యాప్తంగా ప్రజలు సుమారు 4 లక్షల కోట్ల విలువైన 500, వెయ్యి నోట్లను బ్యాంకులకు తిరిగి ఇచ్చేశారు.జనం సొమ్ములు భారీ స్థాయిలో బ్యాంకుల వద్ద జమ అయ్యాయన్నమాట. లక్షలు బ్యాంకుకు జమ చేసిన వారు సైతం వేలకోసం బ్యాంకుల ముందు క్యూల్లో పడిగాపులు కాస్తున్నారు.

రద్దయిన పాత 500 నోట్ల సంఖ్య 1570 కోట్లు! అదే స్థాయిలో కొత్త 500ల నోట్లు ముద్రించేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అంచనా. కొత్త 500 నోట్ల ముద్రణ ఈనెల 10వ తేదీ నుంచే మొదలైంది. సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లలో పగలూ రాత్రి నోట్లు ముద్రించినా… అవసరమైన మేరకు నోట్లు అందుబాటులోకి రావడంలో ‘జాప్యం’ తప్పదు. ఈ విషయాన్ని మన్మోహన్‌కు సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు సౌమిత్రా చౌదురి కూడా చెప్పారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా ప్రకటించినదేకానీ… ఆకస్మికంగా తీసుకున్నదేమీ కాదు. ప్రభుత్వం అనుకుని ఉంటే… రద్దు నిర్ణయం అమలులోకి వచ్చేనాటికే కావాల్సినన్ని కొత్త 500 నోట్లను ముద్రించి ఉండేది. కానీ, అలా చేయలేదు. దీనికి వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయనే అభిప్రాయాలున్నాయి.

మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కరెన్సీకి కటకట ఏర్పడితే దిగువస్థాయి మార్కెట్‌ నడ్డి విరిగినట్లే. ఇక… బ్యాంకులకు వెళ్లిన సొమ్ము సాధారణ రైతులు, కర్షకులు, కార్మికులకు అందుతుందా, అంటే ఆ నమ్మకం కూడా లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు ‘రుణ పరపతి’లేక ఆగిపోయాయి. తాజాగా వస్తున్న సొమ్ములు ఆ దిశగానే మళ్లే అవకాశముంది.

రద్దయిన వాటికీ, కొత్తగా పంపిణీ చేస్తున్న కరెన్సీకి మధ్య ఉన్న తేడావల్ల… బ్యాంకుల వద్ద జనం సొమ్ములుంటాయి కానీ, జనం వద్ద ఆ మేరకు డబ్బులు ఉండవు. అలాగని, జనం సొమ్ములు బ్యాంకులు సొంతం చేసుకుంటాయనేం కాదు. ప్రజలు ఎలాంటి భారీ లావాదేవీలు ఏం చేసినా బ్యాంకుల ద్వారానే చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల బ్యాంకులు బలోపేతం అవుతాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఓ మోస్తరు దుకాణాలు కూడా ‘కార్డులను స్వైప్‌’ చేసే మిషన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మున్ముందు ప్రతి షాపులోనూ స్వైపింగ్‌ మిషిన్లే దర్శనమివ్వనున్నాయి. వెరసి… చిన్నస్థాయి లావాదేవీలు కూడా ‘పన్ను’ కన్నుకప్పలేవన్న మాట పెద్దనోట్ల రద్దువల్ల బ్లాక్‌ మనీ వందశాతం ‘రద్దు’ కాకపోవచ్చు. కానీ… 500, వెయ్యి నకిలీ కరెన్సీ మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే.

NO COMMENTS

LEAVE A REPLY