వాట్.. కాటమరాయుడు వారమేనా??

 Posted March 25, 2017 (5 weeks ago)

wrong statements about katama rayudu movieపవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా కాటమరాయుడు నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచానాలను  అందుకోగలిగింది. కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ముదులిపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే  కలెక్షన్స్ ఖైదీ నెం.150 కలెక్షన్స్ ని క్రాస్ చేసేశాయి. ఇంతలా కాటమరాయుడు సక్సెస్ సాధిస్తే.. మరో పక్క కాటమరాయుడు కేవలం వారం రోజులేనంటూ పవన్ అంటే గిట్టని కొందరు ఇతర అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

ఆల్రెడీ నాలుగు రోజుల క్రితమే గురు సినిమాను మార్చి 31న రిలీజ్ చేద్దామని నిర్ణయించుకుంటే… కాటమరాయుడు పోయింది కాబట్టి గురును ముందుకు తీసుకొస్తున్నారు అని బూటకపు ప్రచారం చేస్తున్నారు. వరుస పెద్ద సినిమాలు ఉండడంతో రోగ్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదని, ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో ఏం లేకపోవడంతో రోగ్ సినిమాను కూడా మార్చి 31నే విడుదల చేసే ఆలోచనలో రోగ్ నిర్మాత సి. ఆర్. మనోహర్ ఉన్నట్లు చెబుతున్నారు. కాటమరాయుడు నెగిటివ్ తెచ్చుకున్నాడని, సినిమా కేవలం వారం రోజులేనని అంటున్నారు. కాగా బాహుబలి సినిమాకు కూడా మొదట్లో ఇలానే నెగిటివ్ టాక్ వచ్చిందని, ఆ తర్వాత అనూహ్యంగా టాలీవుడ్ రికార్డులను  కొల్లగొట్టిందని… అలానే తమ హీరో కూడా   కలెక్షన్లను సాధించి విజయం వైపుకు దూసుకుపోతాడని పవన్ అభిమానులు అంటున్నారు.  

Post Your Coment
Loading...