జగన్నాటకం హోదాపోరు ఆపేందుకేనా?

Posted October 11, 2016

ఓ సమస్య నుంచి తప్పించుకోడానికి చేసే ప్రయత్నంలో మరో సమస్యలో ఇరుక్కోవడం కొందరికి అనుభవమే.ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కి అదే అనుభవం ఎదురవుతోంది.లోకేష్ ని చినరాజప్ప అంశంలో టార్గెట్ చేయడం వెనుక వేరే కధ ఉందని తెలుస్తోంది.అదే హోదాపోరు ని ఆపేయడం.అదికూడా జనం దృష్టిలోపడకుండా.కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి.ఓ 10,15 రోజుల కిందట హోదా అంశాన్ని వైసీపీ ఏ స్థాయిలో ప్రచారం చేసిందో.

యువభేరి పేరిట యువతలో హోదా ప్రయోజనాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేసింది.చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి వెంకయ్యని కలిపి తిట్టింది.చివరకు అయన ఎప్పుడు లేనంతగా రాష్ట్రంలో ఉండి తనపై వస్తున్న విమర్శల్ని కౌంటర్ చేసుకోవాల్సివచ్చింది.అయితే ఉన్నట్టుండి వైసీపీ హోదా ఉద్యమాన్ని మరిచిపోడానికి కారణమేంటని ఆరా తీస్తే అదే పార్టీకి చెందిన ఓ నేత తన పేరు చెప్పొద్దంటూ ఆ రహస్యపు ముడి విప్పాడు.

జగన్ హోదా ఉద్యమం కేంద్రాన్ని చికాకుపరిచిందట.మరికొన్నాళ్లు ఇదే ఊపులో ముందుకెళితే కొంత ఇబ్బంది ఎదురవుతుందని భావించింది కూడా.అదే సమయంలో బీజేపీ కి చెందిన ఓ పక్క రాష్ట్రపు నేత పాత స్నేహాన్ని దృష్టిలోఉంచుకుని ఇదే తరహాలో ముందుకెళితే అవినీతి కేసుల విషయంలో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుందని…ముఖ్యంగా కేంద్ర మంత్రి వెంకయ్యని టార్గెట్ చేస్తే నష్టపోతావని జగన్ ని హెచ్చరించారట.అప్పటిదాకా హోదా ఉద్యమంతో సీఎం పోస్ట్ దక్కుద్దని ఆశలు పెట్టుకున్న జగన్ వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చి ప్లాన్ మార్చారట.అందుకే జనం హోదా అంశాన్ని మర్చిపోయేలా చేసేందుకు లోకేష్ వ్యవహారాన్ని వైసీపీ ఇంత రచ్చ చేసింది.అయితే ఇక్కడ కూడా వీడియో విడుదల తర్వాత చేయికాల్చుకుని దాన్నుంచి బయటపడే దారులు వెతుకుతోంది.

NO COMMENTS

LEAVE A REPLY