టీడీపీ ట్రాప్ లో వైసీపీ?

Posted [relativedate]

ycp in tdp trap
రాజకీయం…రణతంత్రం వేరు..ఆ విషయం తలకెక్కించుకోకుండా వైసీపీ ఇప్పటికే చాలా సార్లు బొక్కబోర్లా పడింది.ఇప్పుడు మరోసారి తెలిసి తెలిసి టీడీపీ ట్రాప్ లో పడింది.విశాఖ జై ఆంధ్ర ప్రదేశ్ సభలో జగన్ ఏమి మాట్లాడాడో అందరూ చూసారు.బాబు మీద చెలరేగిపోయిన జగన్ అసలు హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోడీ ని టార్గెట్ చేయకుండా జాగ్రత్తపడ్డారు.దాన్ని గమనించిన టీడీపీ వెంటనే ఆపరేషన్ సై స్టార్ట్ చేసింది.దమ్ముంటే మోడీని అడగండి …ఢిల్లీలో పోరాటానికి ధైర్యముందా అని దేశం నేతలు రెచ్చిపోయారు..కాదు కాదు వైసీపీ ని రెచ్చగొట్టారు.అప్పటికీ జగన్ నోరు తెరవలేదు.కానీ డామేజ్ కంట్రోల్ కోసమని భూమనని రంగంలోకి దించారు.

భూమన కూడా మోడీని తిట్టించాలని టీడీపీ ఉబలాట పడుతోందని మొదలెట్టారు. ఇంతలో ఏమైందో ఏమో,చంద్రబాబుని తిట్టితిట్టి అలవాటైందేమో …ఒక్కసారిగా హోదా కోసం అవసరమైతే మోడీ బట్టలూడదీస్తాం అనే దాకా వెళ్లారు.టీడీపీ కి కావాల్సింది జరిగింది.విషయం చేరాల్సిన వారికి చేరాల్సిన విధంగా చేరిపోయింది.వైసీపీ బట్టలన్న మరసటి రోజే అయన ఏకంగా జగన్ నోట్లకట్టలకే ఎసరుపెట్టారు.మంటపెట్టిన టీడీపీ హాయిగా జరిగేది చూస్తోంది.నోరుజారిన వైసీపీ నోట్ల దాకా వచ్చిన వ్యవహారం ఇంకెక్కడికి వెళ్తుందోనని వణికిపోతోంది.ఇదంతా ముందే ఆలోచించుకోవద్దా? టీడీపీ ట్రాప్ చేస్తోందని తెలిసి అందులో పడితే ఎలా? చేతిలోఆయుధం..నోటి నుంచి జారిన మాట వెనక్కొస్తాయా?