జగన్ కు వైసీపీ ఎంపీల షాక్!!

Posted February 1, 2017 (4 weeks ago)

ycp mps shock to jaganప్రత్యేక హోదాపై పోరుకు సిద్ధమంటూ కలరింగ్ ఇస్తున్న వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీ ఎంపీలే షాకిచ్చారు. పార్లమెంటులో తొలిరోజు నుంచే గళమెత్తుతాం అని చెప్పిన బీరాలు పలికిన వైసీపీ ఎంపీలు.. తీరా సమయం వచ్చేసరికి చల్లగా జారుకున్నారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం సమయంలో ఇది స్పష్టమైంది.

నిజానికి రాష్ట్రపతి ప్రసంగం సమయంలో వైసీపీ నిరసన తెలుపుదామని ప్లాన్ చేసింది. జగన్ అందరికీ క్లాస్ తీసుకొని మరీ.. ఏమేం చేయాలో చెప్పారు. కాంగ్రెస్ ఎలాగూ నిరసన తెలుపుతుంది.. కాబట్టి వారితో కలిసి నిరసన తెలపాలని ప్లాన్ చేశారు. తీరా ప్రెసిడెంట్ స్పీచ్ మొదలయ్యే టైంకు ముగ్గురు ఎంపీలు డుమ్మా కొట్టేశారు. ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, రేణుక .. ఆ సమయంలో సభలోనే లేకుండా పోయారు. దీంతో జగన్ వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.

ఈ ముగ్గురిలో అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి .. జగన్ కు అత్యంత సన్నిహితులు. పైగా అవినాశ్ రెడ్డి తనకు సమీప బంధువు. నా అనుకున్నవాళ్లే ఇంత షాకివ్వడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే ఇక మీద పార్లమెంట్ సెషన్ లో ఎంపీలంతా తన కనుసైగల్లో ఉండేలా వైసీపీ అధినేత ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. హోదా పోరుతో రాజకీయ లబ్ధి రావాలంటే… ఆ మాత్రం ఎత్తుగడలు తప్పవంటున్నారట జగన్.

NO COMMENTS

LEAVE A REPLY