మోడీ సర్కార్ కి వైసీపీ కన్ను గీటుతోందా?

Posted [relativedate]

ycp party jelous about modi government
జగన్ ఢిల్లీ ఫోబియా ప్రభావమో ఇంకోటో తెలియదు గానీ జగన్ కి అనుక్షణం వెన్నంటి ఆత్మలా వ్యవహరించే ఎంపీ విజయసాయి రెడ్డి మోడీ సర్కార్ కి ఓ విషయంలో దన్నుగా నిలిచాడు.సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ,వ్యక్తులు సందేహాలు వ్యక్తం చేయడం సరికాదని అయన అభిప్రాయపడ్డారు .ఆ స్ట్రైక్స్ వల్ల ప్రతి భారతీయుడి గుండె జాతీయ భావంతో ఉప్పొంగిందని విజయసాయి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.అంతటితో ఆగకుండా స్ట్రైక్స్ విషయంలో రాజకీయాలకి అతీతంగా అందరూఅభినందించాల్సిందేనన్నారు.
మోడీ సర్కార్ చర్యకి వైసీపీ ఈ స్థాయిలో కన్ను గీటడం ఎందుకో అన్న సందేహం రాకమానదు. ఇటీవల వైసీపీ ,కాంగ్రెస్ మధ్య సాగుతున్న రాయబారాల గురించి ఢిల్లీకి ఉప్పందింది.దాని రియాక్షన్ ఎలా ఉంటుందో వైసీపీ కి అర్ధం కాలేదు.హోదా సభలు కూడా జరగనుండటంతో కేంద్ర పెద్దలకి కోపం రాకుండా పాతబడుతున్న స్ట్రైక్స్ వ్యవహారాన్ని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రస్తావిస్తున్నారు.ఈ తెలివితేటల్ని కమలనాధులు ఆ మాత్రం గుర్తించలేరా? ప్రస్తుత రాజకీయాల్లో ఓ చోట నెయ్యం ..మరో చోట కయ్యం సాధ్యమా?