సెలవుల్ని టచ్ చేసిన ఒకేఒక్క సీఎం

Posted April 27, 2017 at 10:17

yogii adithyanadh changed public holidaysచేతిలో ఎంత అధికారం ఉన్నా.. కొన్ని విషయాల్ని అస్సలు టచ్ చేయకూడదు. పవర్ లో ఉన్నా.. కొందరితో అస్సలు పెట్టుకోకూడదు. చూసీ చూడనట్లుగా వదిలేయాలి. ఇలాంటి రొడ్డు కొట్టుడు సలహాలు.. సూచనలు చేసే వారిని అస్సలు పట్టించుకోవటం లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మిగిలిన వారికి భిన్నంగా.. తానేం చేయాలనుకుంటున్నారో క్లారిటీగా చేసేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే తన నిర్ణయాలతో ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ .. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అప్పటికే ఉన్న సెలవుల జోలికి అస్సలు వెళ్లరు. కానీ.. అందుకు భిన్నంగా ఆయన భారీ నిర్ణయమే తీసుకున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తరప్రదేశ్ లో సెలవులు చాలా ఎక్కువ. పండగలు.. ప్రముఖుల పుట్టిన రోజులు.. ఇతరత్రా కార్యక్రమాల కోసం అన్ని ప్రభుత్వాలు అన్నో ఇన్నో సెలువులు ఇచ్చేస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల సెలవుల్ని చూస్తే.. ఇలాంటి సెలువలు ఏడాదికి 15 నుంచి 20 వరకూ కనిపిస్తాయి. కానీ.. యూపీలో మాత్రం ఈ తరహా సెలవులు ఏకంగా 42 పబ్లిక్ హాలిడేస్ కనిపిస్తాయి. ఈ వైనంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం యోగి.. తాజాగా ప్రముఖుల జయంతులు.. వర్ధంతుల సందర్భంగా ఇచ్చే సెలవుల్ని రద్దు చూస్తే నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే.. తనతో రోజూ 18 – 20 గంటలు పని చేసే వాళ్లే తనతో ఉండాలన్న ఆయన.. అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశంలోని ఇన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న సెలవుల్ని ఇంత భారీగా కోతపెట్టే సాహసానికి ఏ ముఖ్యమంత్రి పూనుకోలేదు. అందుకు భిన్నంగా తొలిసారి యోగి ఏకంగా 15 సెలవులకు కోత పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కేంద్రం సెలవుల్ని తగ్గించే ప్రయత్నాలు చేయగా.. ఉద్యోగుల నుంచి వచ్చిన నిరసనతో వెనక్కి తగ్గాల్సి వచ్చిది.

Post Your Coment
Loading...