జగన్ కి అమ్మ గుర్తొచ్చింది…లోగుట్టు ఏమిటో?

Posted April 19, 2017 (5 days ago)

ysrcp leaders celebrate jagan mother vijayamma birthday at guntur
వైసీపీ లో అనుకోని పరిణామం.ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఈరోజు వై.ఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.జగన్ లేడు గానీ పార్టీ ముఖ్య నేతలంతా కేక్ కటింగ్ చేసి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్ జైల్లో వున్నప్పుడు యాక్టివ్ గా వున్న విజయమ్మ, షర్మిల ఆయన బయటికి వచ్చాక ఇంపార్టెన్స్ కోల్పోయారు.విశాఖ లో ఎంపీ గా విజయమ్మ ఓడిపోయాక ఆమె బయటికి రావడం మరీ తగ్గిపోయింది.ఇక షర్మిల గురించి చెప్పక్కర్లేదు.తెలంగాణాలో కొన్నాళ్ళు హడావిడి చేసినా ఆపై సైలెంట్ అయిపోయింది.జగన్ భార్య భారతి,షర్మిల మధ్య విబేధాలని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వార్తలు తప్ప అసలు మనుషులు బయటికి రావడం దాదాపు మానేశారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా గుంటూరు పార్టీ ఆఫీస్ లో విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ysrcp leaders celebrate jagan mother vijayamma birthday at gunturజగన్ కి ఇలా అమ్మ గుర్తుకు రావడం వెనుక లోగుట్టు ఏదో వుండే ఉంటుందని ఆ వేడుకల్లో పాల్గొన్న ఓ వైసీపీ నేత వ్యాఖ్యానించారు.అదేమిటని ప్రశ్నిస్తే ఈడీ కేసుల విషయంలో ఈ మధ్య జగన్ ఢిల్లీ వెళ్ళొచ్చాడు కదా..అక్కడ ఏమి సంకేతం కనిపించిందో గానీ అప్పటి నుంచి అమ్మ భజన అక్కడక్కడా కనిపిస్తోంది,వినిపిస్తోందని ఆ నేత అన్నారు.అంటే అక్కడ ఢిల్లీలోజగన్ కి ఏదో వార్నింగ్ బెల్ మోగినట్టుందిగా!

Post Your Coment
Loading...